Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కమెడియన్ నాగేశ్ కి నేను ఎంతో రుణపడి వున్నాను: డాన్స్ మాస్టర్ సుందరం

  • మొదటి నుంచి డాన్స్ అంటే ఇష్టం 
  • నన్ను పరిచయం చేసింది నాగేశ్ గారు 
  • పెద్ద హీరోలతో పరిచయం ఏర్పడింది
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ సుందరం మాట్లాడుతూ, తన కెరియర్ ఎలా ఆరంభమైందనే విషయాన్ని గురించి ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా నాకు డాన్స్ అంటే ఇష్టం. ఒకసారి జెమినీ గణేశన్ .. సావిత్రి జంటగా ఒక తమిళ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి కొంతమంది డాన్సర్లు కావాలని ప్రకటన వస్తే వెళ్లి కలిశాను. అక్కడి వాళ్లు నన్ను సెలెక్ట్ చేశారు.

ఆ తరువాత కమెడియన్ నాగేశ్ గారు నన్ను తీసుకెళ్లి దర్శకుడు బాలచందర్ గారికి పరిచయం చేశారు .. 'నీర్ కుమిళి' సినిమా కోసం. హీరోగా నాగేశ్ కి .. దర్శకుడిగా బాలచందర్ కి .. సంగీత దర్శకుడు కుమార్ కి అదే ఫస్టు సినిమా. ఆ సినిమాలో నేను కంపోజ్ చేసిన డాన్స్ కి మంచి పేరు వచ్చింది. ఇందుకు కారకుడు నాగేశ్ గారే .. ఆయన చాలా గొప్ప మనిషి .. ఆయనకి నేను ఎంతో రుణపడి వుంటాను. ఈ సినిమా ఆ తరువాత తంగప్ప మాస్టర్ దగ్గర నాలుగేళ్ల పాటు అసిస్టెంట్ గా పనిచేశాను. అప్పుడే నాకు పెద్ద పెద్ద హీరోలతో పరిచయం ఏర్పడింది" అని చెప్పుకొచ్చారు.     
sundaram master

More Telugu News